Jaishankar | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కలిశారు. మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్రం ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన ముయిజ్జుతో జైశంకర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య సంత్సంబంధాలపై ఇరువురూ చర్చించుకున్నట్లు తెలిసింది.
మరోవైపు ముయిజ్జుతో సమావేశమైనట్లు జైశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘ఈ రోజు న్యూ ఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొమహ్మద్ ముయిజ్జును కలుసుకోవడం ఆనందంగా ఉంది. మాల్దీవులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు.
Union Minister Dr S Jaishankar tweets, “Delighted to call on President Dr Mohamed Muizzu of Maldives today in New Delhi. Look forward to India and Maldives working together closely.” pic.twitter.com/XAhYSkXweX
— ANI (@ANI) June 10, 2024
Also Read..
Bye Elections | 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
PM Modi | ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం
Cabinet Meeting | పీఎం ఆవాస్ యోజన సాయం 50 శాతం పెంపు.. అదనంగా 2 కోట్ల గృహాలు..?