న్యూఢిల్లీ, డిసెంబర్ 27: క్విక్ కామర్స్ సేవల సంస్థ జెప్టో..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.11 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.
వచ్చే ఏడాది మార్కెట్లో లిస్ట్ కానున్న అతి పిన్న వయస్సు కలిగిన స్టార్టప్‌లలో ఇది కూడా ఒకటికానున్నది. ఇప్పటికే మార్కెట్లోకి అడుగుపెట్టిన జోమాటో, స్విగ్గీలకు పోటీగా జెప్టో..ఐపీవోకి రాబోతున్నది. 7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన జెప్టో..ఈ ఐపీవో ద్వారా 1.8 బిలియన్ డాలర్లు లేదా రూ.16 వేల కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తున్నది. ఈ అక్టోబర్ నెలలో సంస్థ రూ.3,757 కోట్ల నిధులను సమీకరించింది.