న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కవాసాకి మరో మోటర్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 2026 వెర్షన్‌గా విడుదల చేసిన ఈ వర్సెస్ 650 బైకు ధరను రూ.8.63 లక్షలుగా నిర్ణయించింది. 649 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకులో లిక్విడ్-కూల్డ్ ట్విని-సిలిండర్ ఇంజిన్‌తో తీర్చిదిద్దిన ఈ బైకు రెండు రంగుల్లో లభించనున్నది.
66 బీహెచ్పీ శక్తినివ్వనున్న ఈ బైకులో ఆరు గేర్లు, డ్యూయల్ 300 ఎంఎం డిస్క్ బ్రేక్, 4.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో స్మార్ట్‌ఫోన్‌తో కనెక్టింగ్ చేసుకోవచ్చును, యూఎస్బీ చార్జింగ్ పాయింట్, ఏబీఎస్, అలాగే విండ్‌స్క్రీన్‌ను ఎటైనా కదిలించుకునే విధంగా డిజైన్ చేసింది.