Terrorist | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 26 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు టూరిస్ట్‌లపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటో తాజాగా బయటకు వచ్చింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాది ఏకే 47 తుపాకీ పట్టుకుని పరిగెత్తుతున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ దాడిలో సుమారు పది మంది దాకా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాల్పులు అనంతరం వారంతా సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు తెలిసింది. వారి కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు.
#WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/HSj2va7LsN
— ANI (@ANI) April 23, 2025
Also Read..
Terrorist | పెహల్గామ్ ఘటన.. ఏకే 47 తుపాకీతో ఉగ్రవాది తొలి ఫొటో
Terrorist | ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నటి ఫ్యామిలీ.. కొన్ని గంటల ముందే కశ్మీర్‌ను వీడి..