Stampede | కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట (stampede) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman ) సందర్శించారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L Murugan)తో కరూర్ చేరుకున్న నిర్మలమ్మ ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిసి మాట్లాడారు.
#WATCH | Karur, Tamil Nadu | Union Finance Minister Nirmala Sitharaman and Union Minister Dr L Murugan reach the spot where a stampede occurred on 27th September, during a public event of TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay.
40 people have lost their lives in… pic.twitter.com/KL6HUloD81
— ANI (@ANI) September 29, 2025
కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తొక్కిసలాటకు దారితీసన విషయమై ఆరాతీశారు. అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్మలమ్మ తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు.
Also Read..
Actor Vijay | ‘నా గుండె ముక్కలైంది.. భరించలేని దుఃఖంలో ఉన్నా’ : నటుడు విజయ్
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు
తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు చేయాలి