Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు
Actor Vijay | కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay)కి బాంబు బెదిరింపులు (bomb threat) కలకలం రేపుతున్నాయి.
Actor Vijay | కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాటతో విజయ్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో విజయ్‌కి బాంబు బెదిరింపులు (bomb threat) రావడం ఆందోళన కలిగిస్తోంది.
నీలంకరై (Neelankarai)లోని విజయ్ నివాసానికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నై పోలీసులు అలర్ట్ (High alert) అయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో టీవీకే చీఫ్ నివాసానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ విస్తృత తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాట ఘటన అనంతరం విజయ్‌కి బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
కాగా కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Tamil Nadu | Chennai police received a phone call earlier today claiming that a bomb had been planted at the ECR, Neelankarai residence of Tamilaga Vettri Kazhagam (TVK) Chief and actor Vijay. Following the alert, police personnel rushed to the actor’s residence, and a bomb… pic.twitter.com/Fs7xceZWlI
— ANI (@ANI) September 28, 2025
Also Read..
Parrot | రామచిలుకను పట్టుకునేందుకు ప్రయత్నించి.. 12 ఏండ్ల బాలుడు మృతి
PM Modi | యుద్ధ భూమిలోనూ.. మైదానంలో ఫలితం ఒక్కటే: ప్రధాని మోదీ
Loans for Divorce | విడాకుల తీసుకునేందుకు అప్పులు చేస్తున్న పురుషులు.. సెటిల్మెంట్స్ కోసం లోన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

