న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: వివాహబంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు కొంతమంది పురుషులు అప్పులు కూడా చేస్తున్నారట. విడాకుల సెటిల్మెంట్స్ కోసం 42శాతం మంది పురుషులు లోన్లు తీసుకున్నట్టు ‘వన్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ’ సర్వే నివేదిక తెలిపింది.
టైర్-1, టైర్-2 నగరాల్లోని విడాకులు పొందిన 1,258 మంది నుంచి సమాచారాన్ని సేకరించగా, విడాకులు పొందేందుకు తాము రూ.5 లక్షల వరకు ఖర్చు చేశామని 49 శాతం పురుషులు, 19 శాతం మంది మహిళలు చెప్పారు. విడాకుల సెటిల్మెంట్ తర్వాత అప్పుల్లో కూరుకుపోయామని 29 శాతం మంది పురుషులు తెలిపారు.