న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న రాజకీయ ప్రముఖుల జాబితా అంతకంతకే పెరిగిపోతున్నది. సోమవారం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ రాగా, మంగళవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి కరోనా వైరస్ సోకింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ రోజు చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. మా వైద్యులు సూచించినట్లుగా నేను చికిత్స తీసుకుంటూ, మెడిసిన్ వాడుతున్నాను. ఇటీవలి కాలంలో తనను కలిసిన అధికారులు, మిత్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. కొద్ది రోజులపాటు హోమ్ క్వారెంటైన్లో ఉండండి అని పోఖ్రియాల్ సూచించారు.
Union Education Minister Ramesh Pokhriyal Nishank tests positive for #COVID19 pic.twitter.com/ZIXNXUnFTM
— ANI (@ANI) April 21, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మం