సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
సీఎం కేసీఆర్ | కరోనా వైరస్ బారిన పడ్డ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

వరంగల్ : కరోనా వైరస్ బారిన పడ్డ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రార్థించారు. ఈ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు.

ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలను పునరుద్ధరించి, పురోహితులకు వేతనాలు ఇస్తూ.. ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించి, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమె అన్నారు. దాదాపు రూ. 1200 కోట్లతో యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప ఆలయంగా తీర్చుదిద్దుతున్నారు అని, ఇలాంటి గొప్ప నేత సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని భద్రకాళీ అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దీంతోపాటు త్వరలో జరగబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే తెలంగాణ ఇంటి పార్టీ గా ఉన్నా టీఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

