Durga Puja pandal | దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata)లో ఏటా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా దుర్గామాత మండపాలను (Durga Puja pandal) అద్భుతంగా తీర్చిదిద్దుతుంటారు. ఈ ఏడు కూడా బెంగాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆకారాల్లో దుర్గా మాత మండపాలు వెలిశాయి.
నీటి అడుగున మెట్రో థీమ్‌తో (Underwater metro themed pandal) ఏర్పాటు చేసిన మండపం ఆకట్టుకుంటోంది. జగత్ ముఖర్జీ పార్క్ వద్ద ఈ మండపం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోనే మొదటి నీటి అడుగున మెట్రో థీమ్‌తో ఏర్పాటు చేసిన మండపంగా ఇది నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, కోల్‌కతాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా దుర్గా పూజ (Durga Puja)ను నిర్వహిస్తుంటారు. ఈ పూజకు అరుదైన గౌరవం కూడా దక్కింది. 2021లోనే కోల్‌కతాలో నిర్వహించే దుర్గా మాత పూజకు యునెస్కో వారసత్వ హోదా దక్కింది. మానవ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది.
Also Read..
Haryana MLA | హర్యానాలో బీజేపీకి మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యే.. ఎందుకంటే..!
Kolkata | కోల్‌కతా ఘటనకు నిరసనగా.. దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష, క్యాండిల్ మార్చ్
Rahul Gandhi | హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నాం : రాహుల్ గాంధీ