Haryana MLA : హర్యానాలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే (Independent MLA) దేవేందర్ కడ్యాన్ (Devender Kadyan) బీజేపీ (BJP) కి మద్దతు తెలిపారు. దేవేందర్ కడ్యాన్ గనౌర్ అసెంబ్లీ స్థానం (Ganaur Assembly seat) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. హర్యానా ప్రజలు వరుసగా మూడోసారి కూడా బీజేపీకే పట్టం కట్టడంతో కడ్యాన్ కొత్తగా ఏర్పాటు కాబోయే బీజేపీ ప్రభుత్వానికే తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీజేపీకే మద్దతు ప్రకటించడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు.
‘నేను బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నా. గనౌర్ నియోజకవర్గంలోని మొత్తం 36 తెగలు నాకే ఓటేసి గెలిపించాయి. వారి ఆకాంక్షలన్నీ నెరవేరాలంటే నేను బీజేపీలో చేరడం ఒక్కటే మార్గం. గనౌర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను బీజేపీ మద్దతు ప్రకటిస్తున్నా. ఇంతకుముందు నేను బీజేపీలోనే ఉన్నా. అందరూ నా కుటుంబసభ్యుల లాంటి వాళ్లే. నేను ఇప్పుడు బీజేపీలో చేరడం లేదు. ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇస్తున్నా’ అని కడ్యాన్ ప్రకటించారు.
#WATCH | Delhi: Independent MLA from Haryana’s Ganaur Assembly seat, Devender Kadyan extends support to BJP
He says, “I am supporting the BJP government. All the 36 fraternities of Ganaur have voted for me and their aspirations can be fulfilled only by joining the government. We… pic.twitter.com/sDO0s3HonZ
— ANI (@ANI) October 9, 2024