Encounter | జమ్మూ కశ్మీర్లో (Jammu and Kashmir) బుధవారం ఉదయం ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
జూన్ 11న దోడా జిల్లాలో చటర్ గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది (security forces) గాయపడ్డారు. ఆ తర్వాతి (జూన్ 12) రోజు గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల ఘటనలో ఓ పోలీసు గాయపడ్డారు. ఈ జంట దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ – టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తోపాటు పోలీసులు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నారు. బుధవారం ఉదయం 9:50 గంటల ప్రాంతంలో గండోహ్ ప్రాంతంలోని బజాద్ గ్రామంలో ఉగ్రవాదులు, అధికారుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
Also Read..
Kallakurichi | కల్తీసారా ఘటనలో 61కి పెరిగిన మృతులు.. వివరణ కోరిన ఎన్హెచ్ఆర్సీ
Arvind Kejriwal | కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ ఉపసంహరణ