Padi Kaushik Reddy | మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య ఎన్టీపీసీ ఫ్లైయాష్ వివాదం మరింత ముదురుతున్నది. అవినీతి చేయకపోతే ప్రమాణం చేయాలని మంత్రికి సవాలు విసిరిన పాడి కౌశిక్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. తనపై పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు పొన్నం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రూ.100 కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందని అన్నారు. బ్లాక్‌బుక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ పేరుతోనే మొదలు పెట్టానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విసిరిన ఆరోపణాస్ర్తాలు తెలంగాణ పెద్ద దుమారాన్నే సృష్టించాయి. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ చేసిన ప్రత్యారోపణలపై దీటుగా స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని మంగళవారం వీణవంకలోని తన ఇంటిలో పోలీసులు నిర్భందించారు. ఆయన అక్కడే తడివస్ర్తాలతో బహిరంగంగా ప్రమాణం చేశారు. ఇటు సింగపూర్‌లో ప్రణవ్ను ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రణవ్ ప్రమాణం చేయాలని చెల్పూర్‌కు పెద్దసంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై దౌర్జన్యంగా ప్రవర్తించడంతో లాఠీ దెబ్బలు రుచిచూశారు. ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును మానకొండూర్‌లోని తన ఇంటినుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్భందించారు. మూడు గంటలపాటు కొనసాగిన ఈ హైడ్రామా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వీణవంకలోని తన ఇంటి వద్ద తడివస్త్రాలతో మీడియా ముందుకు వచ్చిన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తాను నమ్ముకున్న వెంకటేశ్వరస్వామి కండువా, ఆంజనేయ స్వామి చిత్రపటాలను పట్టుకుని ప్రమాణం చేసి చెబుతున్నానని, తాను ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు తన నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చెల్పూర్‌కు లా అండ్ ఆర్డర్ సమస్య కావొద్దని పోలీసు చెప్తే ఇంట్లోనే ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. ైప్లెయాష్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడినట్టు తాను బహిరంగంగానే ఆరోపించినా ఎందుకు స్పం దించలేదని ప్రశ్నించారు. మంత్రికి మరో అవకాశం ఇస్తున్నానని, తనతో కలిసి హైదరాబాద్ అపోలో వెంకటేశ్వరస్వామి గుడికి రావాలని, రూ.100 కోట్ల అవినీతి చేయలేదని నిరూపిస్తే, తాను బహిరంగ క్షమాపణ చెబుతానని స్పష్టంచేశారు.