Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Liquor Policy Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
బుధవారం ఉదయం కేజ్రీవాల్‌ను ట్రయల్ కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టులో విచారించిన తర్వాత ఆయనను అరెస్టు చేసేందుకు తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతించింది. దీంతో కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్‌తో తన బెయిల్‌పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. కాగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ వేసిన సవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, కేజ్రీవాల్‌కు బెయిల్‌పై నిర్ణయం తీసుకొనే సమయంలో ఆలోచన చేయలేదని వెకేషన్ బెంచ్ పేర్కొన్నది.
Also Read..
Om Birla | లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా.. మూజువాణీ ఓటుతో ఇండియా కూటమి అభ్యర్థిపై గెలుపు
SI Praveen | ‘నాతో కోపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తా’.. ఓ మహిళకు శాళీగౌరారం ఎస్సై లైంగిక వేధింపులు