SI Praveen | ‘నాతో కోపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తా’.. ఓ మహిళకు శాలిగౌరారం ఎస్సై లైంగిక వేధింపులు
SI Praveen | ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ నిర్వాకాన్ని మరువకముందే మరో ఎస్సై కీచక బాగోతం బయటపడింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై వాస ప్రవీణ్ కుమార్.. ఓ కేసు విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు.
SI Praveen : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ నిర్వాకాన్ని మరువకముందే మరో ఎస్సై కీచక బాగోతం బయటపడింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై వాస ప్రవీణ్ కుమార్.. ఓ కేసు విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు.
తనకు కోపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తానని అసభ్యంగా మాట్లాడాడు. సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ భూవివాదంలో న్యాయం కోసం మండలానికి చెందిన ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. భూవివాదంపై జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై వేధింపులకు గురిచేశాడు.
ఆమె భర్తతో దూరంగా ఉంటుందని తెలుసుకున్న ఎస్సై ప్రవీణ్.. ‘భర్తతో ఎందుకు దూరంగా ఉంటున్నావ్.. అతనితో ఉండటం ఇష్టం లేదా..?’ అని ప్రశ్నించాడు. తనకు సహకరిస్తే కేసును పరిష్కరిస్తానని మాటిచ్చాడు. తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, తన కోసం చేపల కూర, చికెన్ వండుకుని తేవాలని, గ్రీన్ టీ చేసి పెట్టాలని గొంతెమ్మ కోరికలు కోరాడు. రెండు గంటలపాటు తన చాంబర్లో కూర్చోబెట్టుకుని అసభ్యకర మాటలతో విసిగించాడు.
‘కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావాల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్..? అతనితో ఉండాలన్న కోరిక లేదా..?’ అని ఎస్సై తనను వేధించాడని బాధిత మహిళ ఎస్పీకి మొరపెట్టుకున్నారు. తనతో బాగుంటే పూర్తి సహకారం ఉంటుందని అన్నాడని ఆమె విలపించారు. అతని మాట వినకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నాడని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

