teachers die of heatstroke | జనగణన విధుల్లో ఉన్న ఇద్దరు టీచర్లు.. వడదెబ్బతో మృతి
teachers die of heatstroke | జనాభా గణన విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఎండలు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో వారు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
భువనేశ్వర్: జనాభా గణన విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఎండలు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో వారు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. (teachers die of heatstroke) ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఎండలు మండుతుండటంతో ఆ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. మయూర్భంజ్ జిల్లాలోని బెటనటి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడైన రాజ్‌కపూర్ హెంబ్రమ్కు జనగణన కోసం మూడు గ్రామాలు కేటాయించారు. శనివారం ఇంటింటి సర్వే కోసం వెళ్లిన ఆయన ఎండలకు తాళలేక వడదెబ్బకు గురయ్యారు. జనగణన విధులు ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత తనకు అనారోగ్యంగా ఉందని చెప్పారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా, సుందర్‌గఢ్ జిల్లా జరాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అనురాగ్ ఎక్కా కూడా శనివారం జనగణన విధి నిర్వహణలో వడదెబ్బకు గురయ్యారు. అస్వస్థత చెందిన ఆయనను తొలుత గురుండియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
మరోవైపు జనగణన విధి నిర్వహణలో వడదెబ్బకు గురై ఇద్దరు టీచర్లు మరణించడంపై ఆయా జిల్లా కలెక్టర్లు స్పందించారు. అధికారుల నుంచి నివేదికలు అందిన తర్వాతే వారి మరణాలకు గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అన్నారు.
Also Read:
Man Kills Old Man | బస్సు రూట్ చెప్పనందుకు.. వృద్ధుడ్ని చంపిన యువకుడు
Watch: ట్రంప్‌కు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన కర్ణాటక మంత్రి.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- census duty
- die
- Heatstroke
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

