Bengaluru Metro | బెంగళూరు మెట్రోలో ఘర్షణ.. బాక్సింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో
Bengaluru Metro | రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో (Bengaluru Metro) రైల్లో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడ్డారు.
Bengaluru Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Bengaluru Metro) తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. అయితే, ఈ సంస్కృతి ఇప్పుడు బెంగళూరు నగరానికి పాకింది. తాజాగా రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో (Bengaluru Metro) రైల్లో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడ్డారు.
రద్దీగా ఉన్న రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ దూషించుకున్నారు (Two Passengers Exchange Blows). ఏకంగా బాక్సింగ్ క్రీడ (boxing match) తరహాలో ఇద్దరూ కొట్టుకున్నారు. వీరి మధ్య నెలకొన్న గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. తోటి ప్రయాణికులు కలుగజేసుకుని వీరి మధ్య గొడవను ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం చాలా విధాలుగా ప్రమాదకరం అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఒత్తిడి’ కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
A fight broke out between two passengers inside an overcrowded Metro train in Bengaluru.
BMRCL is reviewing the video & investigating further details@OfficialBMRCL pic.twitter.com/x7uwMVqAfs
— ChristinMathewPhilip (@ChristinMP_) July 9, 2024
Also Read..
Bull | పోలీస్ స్టేషన్ పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు..!
Anant Weds Radhika | అంబానీ ఇంట హల్దీ వేడుకలు.. పూల దుపట్టాతో మెరిసిన రాధికా మర్చెంట్
Shiv Sena | ముంబై బీఎండబ్ల్యూ కారు ఘటన.. రాజేష్ షాను పదవి నుంచి తొలగించిన శివసేన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

