ముసారాంబాగ్ : ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయింది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని ముసారాంబాగ్ ప్రాంతంలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు మలక్పేట్ ప్రాంతంలో ఉంటున్న తమ కూతురిని చూసేందుకు సూర్యాపేట నుంచి వచ్చారు. గురవారం రాత్రి స్కూటీపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో మూసారాంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో.. వారు ప్రయాణిస్తున్న స్కూటీని దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
సీసీటీవీ ఫుటేజ్
స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, అక్కడికక్కడే మృతిచెందిన భార్యభర్తలు
హైదరాబాద్ – మలక్పేట్ ప్రాంతంలో ఉంటున్న తమ కూతురిని చూసేందుకు సూర్యాపేట నుండి వచ్చి, స్కూటీపై బయటకు వెళ్లిన తిరుపతి రావు, వెంకటమ్మ దంపతులు
మూసారాంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో వీరు వెళ్తున్న… pic.twitter.com/YEFT9iMfS7
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026