Anant Weds Radhika | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చెంట్ (Radhika Merchant) పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మునిగి తేలుతోంది. తాజాగా హల్దీ వేడుకలను (haldi ceremony) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం సహా బాలీవుడ్ తారలంతా హాజరై సందడి చేశారు.
ఇక ఈ వేడుకల్లో కాబోయే కొత్త జంట అనంత్ – రాధిక పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ముఖ్యంగా రాధికా మర్చెంట్ మరోసారి ఫ్యాషన్‌పై తనకున్న మక్కువను చాటుకుంది. హల్దీ వేడుకల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపు రంగు డ్రెస్‌పై పూల దుపట్టాతో ఆకట్టుకుంది. ఈ దుపట్టా మొత్తం నిజమైన మల్లెపూలతో డిజైన్ చేసిందిగా తెలుస్తోంది. దుపట్టా చుట్టూ బార్డర్‌లా బంతిపూలను అమర్చినట్లుగా ఉంది. వీటితోపాటు నగలు, చెవిపోగులు, గాజులు కూడా పూలతో తయారు చేసినట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఫొటోలు చూసిన నెటిజన్లు అంతా ఈ పూల దుపట్టా గురించే చర్చించుకుంటున్నారు.
పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ వివాహం జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి.
Also Read..
MUDA Scam | కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు.. సిద్ధరామయ్య సహా తొమ్మిది మందిపై ఫిర్యాదు
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు పంపిన ఈడీ