Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు పంపిన ఈడీ
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మరోసారి సమన్లు జారీ చేసింది.
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మరోసారి సమన్లు జారీ చేసింది. రూ.200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekar)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case)లో జాక్వెలిన్‌కు ఈడీ బుధవారం సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే నటిని ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.
కాగా, రూ.200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్‌ను ఈడీ అరెస్టు చేయకపోయినా.. 2022 నవంబర్ 15న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో లంకన్ బ్యూటీని ఈడీ పలుమార్లు విచారించి, ఆస్తులను సైతం అటాచ్ చేసింది.
జాక్వెలిన్‌కు సుకేశ్ చంద్రశేఖర్ రూ.7కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఈడీ ఆరోపించింది. రాన్‌బాక్సీ మాజీ బాస్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్
ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Also Read..
Rahul Dravid | బోనస్ విషయంలో ద్రవిడ్ కీలక నిర్ణయం.. సగానికి తగ్గించాలని బీసీసీఐకి విజ్ఞప్తి..!
PM Modi | 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో అడుగుపెట్టిన భారత ప్రధాని.. సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన మోదీ
Assam Floods | వరదలకు అస్సాం అతలాకుతలం.. 92కు పెరిగిన మృతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

