PM Modi | రెండు రోజుల రష్యా పర్యటనను ముగించుకొని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆస్ట్రియా (Austria)కు పయనమై వెళ్లారు. మంగళవారం సాయంత్రం మాస్కో నుంచి బయల్దేరి వెళ్లిన మోదీ.. వియన్నా (Vienna)లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్‌తోపాటు ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. వియన్నాలో అడుగు పెట్టినట్లు చెప్పారు. తనకు అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రియా ఛాన్సలర్ (Austria Chancellor) కార్ల్ నెమహ్మర్ (Nehammer Karl)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కార్ల్‌తో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి మంగళవారం రాత్రి ఛాన్సలర్ కార్ల్ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ‘ఆస్ట్రియాతో భారత్‌కు దృఢమైన, విశ్వసనీయమైన బంధం ఉంది. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెమహ్మర్తో భేటీ అవుతున్నా. వారితో ప్రజాస్వామ్యం, బహుళత్వ వాదంపై చర్చలు జరపబోతున్నా’ అని పర్యటనకు ముందు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Vielen Dank, Bundeskanzler @karlnehammer, für den herzlichen Empfang. Unsere Nationen werden weiterhin zusammenarbeiten, um das globale Wohl zu fördern. 🇮🇳 🇦🇹 pic.twitter.com/ZTrhXeVUdQ
— Narendra Modi (@narendramodi) July 10, 2024
భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరా గాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ఇందిరా గాంధీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఆ దేశంలో పర్యటించిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఛాన్స్లర్ కార్ల్ అక్కడి వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. అదేవిధంగా వియన్నాలో భారత సంతతి వ్యక్తులతో మోదీ భేటీ కానున్నట్లు తెలిసింది.
మోదీ రష్యా పర్యటన..
మరోవైపు మోదీ సోమ, మంగళవారాల్లో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కోలో మోదీ రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి మోదీకి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రెండో రోజు ఇద్దరు నేతలు విస్త్రృత చర్యలు జరిపారు. రష్యా అధ్యక్షుడి ముందు ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులను విముక్తి కల్పించేందుకు, వారిని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు మంగళవారం అంగీకారం తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో ఈ అంశాన్ని భారత ప్రధాని మోదీ లేవనెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకొన్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా సైన్యంలో 35-50 మంధి భారతీయలు పనిచేస్తుండొచ్చని విదేశాంగ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 10 మంది తిరిగి భారత్‌కు వచ్చేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ తెలిపారు.
Also Read..
USA | యుద్ధం ముగించాలని రష్యాకు చెప్పే సమర్థత భారత్‌కు ఉంది : అమెరికా
Assam Floods | వరదలకు అస్సాం అతలాకుతలం.. 92కు పెరిగిన మృతులు