USA | యుద్ధం ముగించాలని రష్యాకు చెప్పే సమర్థత భారత్‌కు ఉంది : అమెరికా
USA | ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా (Russia) తో వాదించే సమర్థత భారత్ (India) కు ఉన్నదని అమెరికా (USA) వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండు రోజుల రష్యా పర్యటన నేపథ్యంలో వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరైన్ జీన్ పెర్రీ (Karine Jean-Pierre) ఈ వ్యాఖ్యలు చేశారు.
USA : ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా (Russia) తో వాదించే సమర్థత భారత్ (India) కు ఉన్నదని అమెరికా (USA) వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండు రోజుల రష్యా పర్యటన నేపథ్యంలో వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరైన్ జీన్ పెర్రీ (Karine Jean-Pierre) ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) తో భేటీ కానున్న నేపథ్యంలో అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నాటో సదస్సు (NATO summit) సందర్భంగా బైడెన్, జెలెన్స్కీ భేటీ కానున్నారు. రేపు (గురువారం) అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నాటో సదస్సు జరగనుంది. కాగా రష్యా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధం అంశాన్ని ప్రస్తావించారు. యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు పలుకాలని సూచించారు. యుద్ధంలో పసిబిడ్డల మరణం హృదయ విధాకరమని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. ఉక్రెయిన్‌లోని చిల్డ్రన్స్ హాస్పిటల్లు లక్ష్యంగా రష్యా మారణహోమానికి పాల్పడుతున్నదని జెలెన్స్కీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రస్తావన చేశారు. అయితే జెలెన్స్కీ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

