Isha Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చెంట్ (Radhika Merchant) పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మునిగి తేలుతోంది.
ఇక ఈ వేడుకల్లో భాగంగా అంబానీ ముద్దుల కుమార్తె ఈషా అంబానీ (Isha Ambani), పెద్ద కోడలు శ్లోకా మెహతా, కాబోయే కోడలు రాధిక మర్చంట్ సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా ఈషా అంబానీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంత్ – రాధిక వివాహానికి ముందు జరిగే ఓ వేడుకలో ఈషా సంప్రదాయం ఉట్టిపడేలా తయారైంది. గోల్డ్ బ్లౌజ్, బ్లూ లెహంగా, దుపట్టా ధరించింది. డ్రెస్సింగ్ స్టైల్‌కు తగ్గట్టుగానే బంగారు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలను ధరించింది. మెడలో హారం, చెవి పోగులు, గాజులతో అందంగా ముస్తాబైంది.
అయితే, ఈషా కేశాలంకరణ మాత్రం ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియన్ టచ్‌తో తన జడను అలంకరించుకుంది ఈషా. వజ్రాలు, రత్నాలతో కూడిన బంగారు జడను తన జుట్టుకు తగిలించి పైన పూలతో అందంగా అలంకరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సెలబ్రిటీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ వివాహం జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి.
Also Read..
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు పంపిన ఈడీ
Rahul Dravid | బోనస్ విషయంలో ద్రవిడ్ కీలక నిర్ణయం.. సగానికి తగ్గించాలని బీసీసీఐకి విజ్ఞప్తి..!
PM Modi | 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో అడుగుపెట్టిన భారత ప్రధాని.. సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన మోదీ