Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మరోసారి ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. బీజాపూర్ (Bijapur) జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావొయిస్టులు హతమయ్యారు.
జిల్లాలోని కోల్నార్ ప్రాంతంలో (Kolnar area) భద్రతా దళాలు (security forces) ఇవాళ ఉదయం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసుల స్పెషల్ టాస్క్ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావొయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read..
Hanuman Jayanti | హనుమాన్ జయంతి.. అయోధ్యకు పోటెత్తిన భక్తులు
Fire | అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. బాల్కనీల నుంచి దూకిన నివాసితులు.. VIDEO
Dust Storm: ఢిల్లీలో డస్ట్ స్టార్మ్.. 205 విమానాలు ఆలస్యం