Jawans Killed : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు (Terrotists) మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. అక్నూర్ (Akhnoor) సరిహద్దుల్లో మందుపాతర (IED) పేలి ఇద్దరు జవాన్లు (Soldiers) దుర్మరణం పాలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం భద్రతా బలగాలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.
కాగా, ఇటీవల ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కూడా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనం ఎస్కే పయీన్ ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా రోడ్డుపై నుంచి జారిపడింది. ఈ ఘటనను మరువకముందే ఇప్పుడు మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మరణించారు.
JEE Main 2025 Results | జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. వెబ్సైట్లో స్కోర్ కార్డ్స్
Fire accident | ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. Video
Hamas | ట్రంప్ ఆ సంగతి తప్పక గుర్తుంచుకోవాలి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికకు హమాస్ రెస్పాన్స్
Chattishgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?