భోపాల్: హైవేపై వెళ్తున్న కారు లేన్ మారేందుకు ప్రయత్నించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ, ఆ కారును ఢీకొట్టింది. వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. (Truck Drags Car) అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 20న భావ్గఢ్ ఫాంటే సమీపంలోని మోవ్-నీముచ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ లేన్ మారుతున్న కారును ఢీకొట్టింది. సుమారు వంద మీటర్ల దూరం వరకు ఆ కారును ఈడ్చుకెళ్లింది.
కాగా, రాజస్థాన్లోని నాథ్ద్వారాలో నివసించే శ్యామ్ సుందర్ లోహర్ ఆ కారును డ్రైవ్ చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి రత్లాంకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారును కొంతదూరం లారీ ఈడ్చుకెళ్లినప్పటికీ అందులో ఉన్న శ్యామ్ సుందర్, అతడ్ని స్నేహితుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. కారుకు కొంత నష్టం వాటిల్లింది.
మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంపై లారీ, కారుకు చెందిన వారు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే అక్కడ వారి మధ్య రాజీ కుదిరింది. లారీ డ్రైవర్ క్షమాపణ చెప్పడంతో తాము ఫిర్యాదు చేయలేదని శ్యామ్ సుందర్ అన్నాడు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH : Truck Rams Into Car in Mandsaur, Madhya Pradesh; Drags Vehicle Along Highway
According to eyewitnesses, the incident took place near the Bhanpura area, where the truck lost control and rammed into a car from behind.
The impact was so intense that the car got stuck… pic.twitter.com/Mn3uxzDdEJ
— upuknews (@upuknews1) June 20, 2025
Also Read:
Will Crash Plane | మహిళా వైద్యురాలు దురుసు ప్రవర్తన.. విమానాన్ని కూల్చివేస్తానని బెదిరింపు
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం