Raigad Fort | మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) సైతం వర్షం దంచికొట్టింది. ఏకంగా ఏడు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపించాయి. పలుప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్ (Raigad Fort)ను సైతం వరద చుట్టుముట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఫోర్ట్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. వాతావరణం చల్లగా ఉండటంతో చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఫోర్ట్ సందర్శనకు తరలివచ్చారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల మధ్యలో అక్కడ భారీ వర్షం కురిసింది. ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు (Tourists stuck). వారంతా ఎటూ వెళ్లలేని పరిస్థితి. సాయం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొండలపై నుంచి ఉద్ధృతంగా కిందకు జారుతున్న జలపాతాన్ని పోలిన నీటి ప్రవాహం మధ్య పర్యాటకులు రెయిలింగ్‌లు, మెట్లను పట్టకుని కనిపించారు.
A horrific video from Raigad Fort shows over 30 people stranded due to heavy rainfall causing intense water streams. Rescue operations are underway, and fortunately, there are no casualties reported so far. #Raigad #RescueOps #HeavyRainfall #raigadfort pic.twitter.com/b29xXx2o9t
— Naresh Jat (@nareshk181) July 8, 2024
ముంబైని ముంచెత్తిన వాన
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) వర్షం దంచికొట్టింది. సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం 7 గంటలవ వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. పలుప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి.
ఏడు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. అంధేరి, కుర్లా, భందూప్, కింగ్స్ సర్కిల్, దాదర్‌తోపాటు పలు ప్రాంతాలు నీటమునిగాయని చెప్పారు. భారీ వర్షానికి డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయని, దీంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు. దీంతోపాటు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. పలు రైళ్లను సెంట్రల్ రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. ఇక భారీ వర్షాల కారణంగా ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది.
Also Read..
Mumbai Rains | ముంబయిలో భారీ వర్షాలు.. 50పైగా భారీగా విమానాలు రద్దు..!
Kidney Scam | 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. గుంటూరులో భారీ మోసం
TG Rains | రాష్ట్రంలో రెండురోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ