TG Rains | తెలంగాణలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం చెప్పింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, జయశంకర్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసిందని టీజీడీపీఎస్ పేర్కొంది. అత్యధికంగా భూపాలపల్లిలో 67.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని తెలిపింది.