భోపాల్ : మధ్యప్రదేశ్ అటవీ శాఖ శనివారం ఏర్పాటు చేసిన అటవీ ఉత్పత్తుల ప్రదర్శనలో ఆకర్షణీయమైన పండ్లు, కూరగాయలు జనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఐదు అడుగుల పొడవున్న సొరకాయ, ఒకటిన్నర కేజీల నిమ్మకాయ, అంగుళం పరిమాణం గల నారింజ పండు, ఏడు కిలోల బరువున్న తెల్ల సొరకాయ, రకరకాల మొక్కలు, పండ్లు, చిరుధాన్యాలు సందర్శకులను ఆకర్షించాయి. ఆయుర్వేద ఔషధాలు, మూలికలు, గిరిజనులు తయారు చేసిన వస్తువులను కూడా ప్రదర్శించారు.