Mumbai Rains | ముంబయిలో భారీ వర్షాలు.. 50పైగా విమానాలు రద్దు..!
Mumbai Rains | ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు రోడ్లపై వరద పోటెత్తుతున్నది. ఫలితంగా ట్రాఫిక్ జామవుతున్నది. అదే సమయంలో వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది.
Mumbai Rains | ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు రోడ్లపై వరద పోటెత్తుతున్నది. ఫలితంగా ట్రాఫిక్ జామవుతున్నది. అదే సమయంలో వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తున్నది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు పలుచోట్ల 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదర్ అతలాకుతలమైంది. ఇక్కడ రోడ్లపై నుంచి రైలు పట్టాల వరకు నీరు నిండిపోయింది. కార్లు రోడ్లపై నీటిలో తేలియాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సెలవు ప్రకటించింది.
భారీ వర్షాలతో వెళుతురు లేని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు రన్‌వే కార్యకలాపాలను నిలిపివేసింది. దాంతో 50పైగా విమానాలను రద్దు చేయడంతో పాటు ఆయా విమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్‌కు మళ్లించారు. ఇదిలా ఉండగా.. వరద పరిస్థితిని సమీక్షించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంబయి గార్డియన్ మంత్రి ఎంపీ లోధా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి అనిల్ పాటిల్ సైతం హాజరయ్యారు. సమావేశంలో సీఎం షిండే మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి ముంబయిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షం నీటిని తోడేందుకు 200 నీటి పంపులు, 400 బీఎంసీ పంపులు పని చేశాయని.. సెంట్రల్, హార్బర్ లైన్లలో రైళ్లు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

