– రాతి విజయలక్ష్మి, జడ్చర్ల
ఇల్లు అంటే డబ్బు కాదు. సంపదలు, అధికారం రాగానే మనిషి నూరేళ్లు ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడని ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వరు కదా. కుటుంబంలో ఎన్నో అంశాలు ఉంటాయి. పిల్లలు, వారి ఎదుగుదల, తల్లి, భార్య, బంధువులు ఇలా ఎన్నో అనుబంధాల అల్లిక పేరే ఇల్లు. ఈ మల్లెతీగల వంటి సంసారంలో ఎక్కడ ఏది జరిగినా.. ఆ చెట్టు ఎదుగుదల సరిగ్గా ఉండదు. ప్రతి ఇంటిలో ఆరోగ్యకరమైన జీవనం గడపాలి. ఎంత డబ్బు ఉన్నా శాస్త్రం చెప్పినట్టు వినకపోతే అనర్థాలు ఎదురవుతాయి. పుట్టే పిల్లలకు పోలియో వచ్చినా, అంధత్వం వచ్చినా.. డబ్బు పూర్తిస్థాయిలో నయం చేయలేదు కదా. అన్నిటినీ పాటిస్తూ జీవిస్తున్నా కూడా.. అంతంత మాత్రమే ఆనందంగా ఉంటున్నాం. ఇక శాస్ర్తాన్ని పక్కన పెడితే అంతే సంగతులు. ఒకరితో పోల్చుకోకుండా మీ ఇళ్లు బాగుండేలా జాగ్రత్తలు తీసుకోండి.
– ఆవుల శ్రీనివాస్, జీడికల్
దిగులు వద్దు. వాటికవిగా ఎన్నోరకాల మొక్కలు, పుట్టగొడుగులు చాలా చిత్రవిచిత్రంగా పెరుగుతుంటాయి. అవన్నీ గొప్పవి అనుకోవద్దు, తప్పు చేస్తాయని భావించొద్దు. వాటిని మీరు పండించనప్పుడు, తొలగించే హక్కు లేదు. ప్రతిదీ మనకు హాని చేస్తుందనే ఆలోచనలతో మీ తల పగలగొట్టుకోవద్దు. పుట్టగొడుగులు కూడా అస్తమానం పెరగడం వల్ల చెడువాసన వస్తుంటాయి.

అలాంటి వాటిని తొలగించడం తప్పుకాదు. మన ఇంటి పరిసరాలలో ఖాళీ స్థలం ఉంటే మట్టిని సారవంతం చేసి.. ఆరోగ్యాన్ని అందించే కూరగాయలను పెంచుకోండి. అప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా ఇంటికి, ఒంటికి ఉపయోగపడతాయి.
– మారుతి, బద్వేలు
స్థలం ఖాళీగా ఉంటే ఇలాంటి పెంపుడు జంతువుల గృహాలు నిర్మిస్తుంటారు. ఈ రోజుల్లో చాలా పెద్దగా, గదులు గదులుగా వరుసపెట్టి కడుతున్నారు. వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వడానికి బారీగేట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అలాకాకుండా స్థలం తక్కువ ఉంటే, ఉన్న స్థలంలోనే 6X6 లేదా 4X4 అడుగుల పరిమాణంలో చుట్టూ జాలిపెట్టి గదిని నిర్మించుకోండి. ఇవి ఇంటికి దగ్గరగా ఉండాలనుకుంటే వాయవ్యం లేదా ఆగ్నేయ దిశల్లో కట్టుకోవాలి.

దినమంతా వాటిని బంధించి రాత్రుళ్లు స్వేచ్ఛగా తిరిగేలా ఏర్పాటు చేసుకోవాలి. కుక్కలను వంటగదికి, డైనింగ్ టేబుల్, బెడ్రూంలకు దూరంగా పెంచాలి. వాటి శ్వాస, లాలాజలం మన జీవన వ్యవస్థకు మంచిది కాదు. వాటిని పెంచే క్రమంలో అతి గారాబం చేసి అనారోగ్యాలు కొనితెచ్చుకోవద్దు.
– పద్మ, కల్వకుర్తి
మీరు అడిగిన మాట ఒకప్పుడు చెలామణిలో ఉండేది. పల్లెలు పట్టణాలుగా మారుతున్న తరుణమిది. అన్నిచోట్లా అవసరాలతోపాటు టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో గ్రామంలో నేలమీద నిలబడే.. మట్టి, కర్రలతో గోడలు పెడుతూ నిర్మాణాలు చేసేవారు. మట్టితో ఎక్కువ అంతస్తులు నిర్మించడం కష్టమని, ఒకవేళ అలాంటి సాహసం చేసినా కిందపడిపోతాయని, అందులో నివసించే వారి ప్రాణాలకే ప్రమాదమని భావించేవాళ్లు.

నేడు అలాకాదు.. అన్నిరకాలుగా పటిష్టమైన నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి భయంలేకుండా పెద్దపెద్ద ఇండ్లు నిర్మిస్తున్నారు. ఎంత ఎత్తులో నిర్మాణాలు చేపట్టినా.. శాస్త్రలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీడకోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం, భద్రత, పిల్లల ఎదుగుదల వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143