శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 22:05:48

అడ‌విలోకి వెళ్లేందుకు నానాతంటాలు ప‌డిన పెద్ద‌పులి!

అడ‌విలోకి వెళ్లేందుకు నానాతంటాలు ప‌డిన పెద్ద‌పులి!

అడ‌విలో ఉన్న పులులు ఎప్పుడెప్పుడు బ‌య‌టికి వ‌చ్చి వేటాడి తిందామా అనుకుంటాయి. ఈ పులి మాత్రం ఎప్పుడెప్పుడు అడ‌విలోకి వెళ్దామా అని చూస్తుంది. పాపం అడ్డుగా ఉన్న గోడ‌ను దూకేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిందో. ఈ ప్ర‌య‌త్నాల వీడియోతో ఆ పులి నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వాన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

'ఈ విధంగా మానవ ఇన్ఫ్రా వన్యప్రాణులకు సమస్యల‌ను సృష్టిస్తుంది. ఇక్కడ ఒక పులి అలాంటిదాన్ని దాటడానికి కష్టపడుతోంది. పెంచ్ అధికారులు అతన్ని సురక్షితంగా అడవిలోకి పంపించారు. ఇది కేవలం ఒక ఉదాహరణ' అనే శీర్షిక‌ను జోడించారు.  ఈ క్లిప్‌లో పులి అనేక‌సార్లు ఎక్క‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 18.3కే మంది వీక్షించారు.logo