Doda | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టెంపో వాహనం అదుపుతప్పి లోయలోకి పడిపోయింది (vehicle falls into gorge). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దోడా (Doda) జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో వాహనం పోండా సమీపంలోని దోడా-భార్త్ రహదారిపై అదుపు తప్పింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Rahul Gandhi | ‘అది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య’.. ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ
Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా
GE-404 engine | అమెరికా నుంచి భారత్‌కు మరో GE-404 ఇంజిన్.. త్వరలో మరికొన్ని..!