Rahul Gandhi : ఒడిశా (Odisha) లోని బాలాసోర్ (Balasore) లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) పై లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పందించారు. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్య అని ఆయన వ్యాఖ్యానించారు.
లైంగిక వేధింపులకు గురైన 22 ఏళ్ల విద్యార్థిని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడ్డారని, దాంతో ఆమె తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇది బీజేపీ సిస్టమ్ చేసిన హత్యేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ఒడిశాలోని బీజేపీ సర్కారు నిందితుడికి కొమ్ముకాసిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడాలన్నారు. దేశంలోని ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ సిస్టమ్ ఎప్పుడూ నేరగాళ్లకు కొమ్ముకాస్తుందని, ఇప్పుడే కూడా అదే చేసిందని విమర్శించారు. ఆ విద్యార్థినిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్యేనని అన్నారు.