గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ‘ఆయన రాజా అనుకుంటాడు. కానీ త్వరలో జైలుకు వెళ్తాడు’ అని అన్నారు. బుధవారం అస్సాంలోని చాయ్గావ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను తీవ్రంగా విమర్శించారు. ‘అస్సాం ముఖ్యమంత్రి తనను ‘రాజా’ అని అనుకుంటున్నారు. కానీ త్వరలోనే ఆయన జైలులో ఉంటారు’ అని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి సీఎం, ఆయన కుటుంబాన్ని ప్రజలు బాధ్యులుగా చేస్తారని తెలిపారు. ‘కాంగ్రెస్ ఆయనను జైలులో పెట్టదు. ప్రజలే ఆయనను జైలులో పెడతారు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, రాహుల్ గాంధీపై సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా అనేక క్రిమినల్ కేసులు నమోదైన రాహుల్ గాంధీ బెయిల్పై బయట ఉన్న సంగతి మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
Also Read:
Opposition ‘Lungi Protest’ | లుంగీ, బనియన్లు ధరించి ప్రతిపక్షాల నిరసన.. ఎందుకంటే?
Mamata Banerjee | బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా: మమతా బెనర్జీ
Woman Strangles Daughter | ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ.. కుమార్తెను చంపి భర్తపై నింద