ముంబై: ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద లుంగీ, బనియన్లు ధరించారు. లుంగీ బనియన్‌తో క్యాంటీన్ మేనేజర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే తీరును వారు ఖండించారు. (Opposition ‘Lungi Protest’) ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో గత మంగళవారం లుంగీ బనియన్‌తో ఉన్న శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, క్యాంటీన్ మేనేజర్‌పై దాడి చేశారు. ఆహార నాణ్యతపై ఆరోపణలు చేశారు. పరిస్థితిలో మార్పురాకపోతే మళ్లీ ఇలాగే స్పందిస్తానని ఆయన హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
కాగా, మహారాష్ట్రలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ మేనేజర్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా వారు లుంగీలు, బనియన్లు ధరించారు. ‘చడ్డీ బనియన్ గ్యాంగ్‌ను మేం ఖండిస్తున్నాం’ అని నినాదాలు చేశారు. సంజయ్ గైక్వాడ్ ప్రవర్తన ప్రజా ప్రతినిధికి తగనిదని విమర్శించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | Mumbai: Opposition leaders including Shiv Sena(UBT) MLC Ambadas Danve (@iambadasdanve), NCP(SP) leader Jitendra Awhad (@Awhadspeaks), and others hold protest on the steps of Maharashtra Vidhan Bhavan, raising slogans ‘We Condemn The Chaddi Baniyan Gang’.#Maharashtra… pic.twitter.com/UY6M9nyrm3
— Press Trust of India (@PTI_News) July 16, 2025
At the MLA residence canteen Mumbai, PM Narendra Modi’s most favourite and trustworthy MLA, Sanjay Gaikwad (SS Shinde), was seen assaulting a poor staffer over bad food. But since he’s from a BJP ally, the media won’t highlight it or call it hooliganism pic.twitter.com/JTYPvFYaRr
— Pritesh Shah (@priteshshah_) July 9, 2025
Also Read:
Mamata Banerjee | బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా: మమతా బెనర్జీ
Watch: ఫొటో కోసం పోజులియ్యపోయిన ఆలయ కమిటీ చైర్మన్.. తర్వాత ఏం జరిగిందంటే?