కోల్కతా: బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి తాను సిగ్గుపడుతున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా బుధవారం కోల్కతాలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన నిరసన ర్యాలీలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ సీనియర్ నేతలతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాలీ మాట్లాడే వారందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలు అని బీజేపీ పిలుస్తున్నదని విమర్శించారు. రోహింగ్యాలు మయన్మార్లో నివసిస్తారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ పౌరులందరికీ సరైన గుర్తింపు కార్డులు, గుర్తింపు ఉన్నాయని అన్నారు. ‘బెంగాల్ బయటకు వెళ్లిన కార్మికులు స్వయంగా వెళ్లలేదు. వారికి నైపుణ్యాలు ఉన్నందున వారిని నియమించారు. బెంగాలీ మాట్లాడే వారిని అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. ఎందుకు? పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగం కాదా?’ అని ప్రశ్నించారు. బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు.
మరోవైపు ఆ రాష్ట్రంలోని జిల్లాల్లో కూడా టీఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు ఒక రోజు ముందు ఈ నిరసనలు జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది. బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
#WATCH | Kolkata: West Bengal Chief Minister Mamata Banerjee, TMC MP Abhishek Banerjee and other party leaders and workers take out a protest march alleging harassment of Bengali-speaking people in BJP-ruled states. pic.twitter.com/ufTYob21qI
— ANI (@ANI) July 16, 2025
Also Read:
Watch: ఫొటో కోసం పోజులియ్యపోయిన ఆలయ కమిటీ చైర్మన్.. తర్వాత ఏం జరిగిందంటే?