కట్టంగూర్, ఫిబ్రవరి 16 : గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, గ్రామ సభలో పాల్గొనడం, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. శిక్షణ ద్వారా వార్డు సభ్యులకు బాధ్యతలు, అధికారులు, పరిపాలనా విధానం, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ పారదర్శక పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలను వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి స్వరూపారాణి, మండల పరిషత్ పర్యవేక్షకులు చింతమల్ల చలపతి, టీఓటీలు వెంకన్న, మల్లేష్, నర్సింహ్మ, స్వామి, సైదులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం : ఎంపీడీఓ జ్ఞానప్రకాశరావు