శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తున్నది. తాజాగా 13 జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసిన జిల్లాల జాబితాలో జమ్ము, కథువా, సాంబా, పూంచ్, రాజౌరీ, ఉధంపూర్, అనంతనాగ్, బందిపొరా, బారాముల్లా, బుద్గామ్, గండేర్బల్, పుల్వామా, సోఫియాన్ జిల్లాలు ఉన్నాయి. అయితే, ఈ 13 జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ రోజువారీ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని, ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో