సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 26: ఎన్హెచ్ఎం ఉద్యోగులు మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు. తమ హక్కుల కోసం ఈ నెల 28న ‘చలో కమిషనరేట్’ కార్యక్రమానికి సిద్ధమైనట్టు ఎన్హెచ్ఎం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పుట్ట మహేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో కమిషనరేట్’ నోటీసును శనివారం అడిషనల్ డీఎంహెచ్‌వో మదన్మోహన్కు అందజేశారు.
ఈ సందర్భంగా మహేందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తూ ప్రజలకు నిరంతరం ఆరోగ్యసేవలు అందిస్తున్న 17వేల మందికిపైగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించారు. రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత, సమానవేతనం, పీఆర్సీ, పెండింగ్ వేతనాలు, ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, మాతృత్వ సెలవులు, ఇన్సూరెన్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. సోమవారం కోఠిలోని ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయం వద్ద ‘చలో కమిషనరేట్’ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్టు చెప్పారు.