కీచక వ్యాయామ ఉపాధ్యాయుడిపై వేటు
విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక వ్యాయామ ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గుదిమళ్ల ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఎండీ షఫీక్ అహ్మద్ పదేండ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు.
- గుదిమళ్ల పీడీ షఫీక్ అహ్మద్‌పై పోక్సో కేసు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 26 : విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక వ్యాయామ ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గుదిమళ్ల ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఎండీ షఫీక్ అహ్మద్ పదేండ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు హెచ్ఎం నందూలాల్‌కు విషయాన్ని వివరించి బాధపడ్డారు. దీంతో హెచ్ఎం పిల్లల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని, మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పీడీ కీచక చేష్టల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం కీచక ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు ఖమ్మం సఖి కేంద్రానికి బాధిత విద్యార్థినులను తీసుకెళ్లి వివరాలు సేకరించారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల మేరకు షఫీక్ అహ్మద్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు జిల్లా బాలికల అభివృద్ధి అధికారి రూబీ, ఖమ్మం అర్బన్ ఎంఈవో శైలజ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఎంఈవో శ్రీనివాస్‌తో కలిసి నివేదికను డీఈవోకు అందజేశారు. ఈ మేరకు పీడీని సస్పెండ్ చేస్తూ డీఈవో సదానందం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్’
Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

