మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:23:36

ఆగస్ట్ కల్లా మార్కెట్ లోకి కరోనాను గుర్తించే రిస్ట్‌బ్యాండ్

  ఆగస్ట్ కల్లా మార్కెట్ లోకి కరోనాను గుర్తించే రిస్ట్‌బ్యాండ్

చెన్నై : కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలు. అయితే ఈ వైరస్ ను   ఎదుర్కోవడానికి అవసరమైన పరిష్కారాలను కనుగొనడానికి అనేక సంస్థలు పరిశోధనలో నిమగ్నమయ్యాయి. అందులో భాగంగానే ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ మ్యూజ్ వేరబుల్స్ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి రిస్ట్ బాండ్ తయారీ కోసం రూ.22 కోట్లు సమీకరించింది. ఇది కరోనా ప్రారంభ దశలో ఉన్న సమయంలో గుర్తించనున్నది.  వచ్చే నెల ఆగస్ట్ నాటికి ఈ రిస్ట్ బ్యాండ్ 70 దేశాల్లో మార్కెట్ లోకి అందుబాటులో ఉంటుంది. ఈ రిస్ట్ బ్యాండ్ ధర రూ.3,500.

ఈ రిస్ట్ బాండ్ శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగాన్ని ట్రాక్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ తెలియజేస్తుంది. కరోనా మహమ్మారి వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఉంటే వీటి ద్వారా ట్రాక్ చేయడానికి సులువు అవు తుంది. ఈ ఏడాది తాము 2 లక్షల ఉత్పత్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2022 నాటికి పది లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ అలుమ్నీ కేఎల్ఎన్ సాయి ప్రశాంత్ చెబుతున్నారు.

తమ ఉత్పత్తిపై ఇన్వెస్టర్లు విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఇందుకోసం తాము రూ.22 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. మ్యూజ్ వేరబుల్స్ తయారు చేస్తోన్న రిస్ట్ బాండ్‌ను మ్యూజ్ హెల్త్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌కు అనుసంధానించవచ్చు. యూజర్ డేటా ఫోన్, రిమోట్ సర్వర్‌లో సేవ్ అవుతుంది. ఇందులో మరిన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ ద్వారా ఆరోగ్య సేతు యాప్ అలర్ట్స్ పొందవచ్చు. యూజర్లు ఎవరైనా కంటైన్మెంట్ జోన్‌ లేదా కరోనా హాట్‌స్పాట్ సెంటర్‌లోకి వెళ్తే వెంటనే గుర్తించవచ్చు.logo