Spurious Liquor | బీహార్ (Bihar) రాష్ట్రంలో కల్తీ మద్యం (Spurious Liquor) మరోసారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని సరన్ (Saran), సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
#UPDATE | Bihar: The death toll in Siwan, Bihar after consuming illicit liquor, rises to 20: SP Siwan Amitesh Kumar https://t.co/GhfIE9961h
— ANI (@ANI) October 17, 2024
అత్యధికంగా సివాన్ (Siwan) జిల్లాలో ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సివాన్ ఎస్పీ అమితేష్ కుమార్ తెలిపారు. దాదాపు 15 మంది అస్వస్థతకు గురి కాగా వారిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చాప్రా ఎస్పీ కుమార్ ఆషిశ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అందులో ముగ్గుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
#UPDATE | Till now, four people have lost their lives after consuming spurious liquor in Saran district. We have formed SIT and lodged an FIR against 8 people, Three people have already been arrested: Chhapra SP, Kumar Ashish https://t.co/TXJNkVYcPI
— ANI (@ANI) October 17, 2024
సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా బ్లాక్ మార్కెట్లో అక్రమంగా మద్యం దందా కొనసాగుతూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏటా పదుల సంఖ్యలో ప్రజలు ఈ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read..
KTR | అస్తిత్వ ఉద్యమాలకు.. ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ కుమ్రం భీం: కేటీఆర్
Bengaluru Test | 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా.. విరాట్, సర్ఫ్రాజ్ డకౌట్
KTR | పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. రేవంత్ ఢిల్లీ టూర్లపై కేటీఆర్ ఫైర్