బెంగళూరు: న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరుగుతున్న మొదటి టెస్టులో (Bengaluru Test) టీమ్ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పది పరుగులకే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దయిన విషయం తెలిసిందే. రెండో రోజైన నేడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. యశస్వీ జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్‌కు దిగాడు. 16 బంతులు ఎదుర్కొన్న హిట్‌మాన్ 2 రన్స్మాత్రమే చేసి టిమ్ సౌతీ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. ఇక 8 తర్వాత తొలిసారి ఫస్ట్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ అసులు ఖాతానే తెరువకుండా పెవిలియన్‌కు చేరాడు. 9 బాల్స్ ఆడిన కింగ్ కోహ్లీ ఇన్నింగ్ 8.6వ ఓవర్లో విలియమ్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇక రెగ్యులర్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ను పక్కకుపెట్టి మరీ జట్టులోకి తీసుకున్న సర్ఫ్రాజ్ ఖాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. తనకు లభించిన మంచి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకున్నాడు. ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్లు ఔటై జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫ్రాజ్.. 3 బ్యాల్స్లోనే పరుగులేమీ చేయకుండా వచ్చినదారినే వెళ్లాడు. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ 9.4వ ఓవర్లో కాన్వేకి సునాయాస క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం జైస్వాల్‌తో (8/37) కలిసి పంత్ క్రీజ్‌లో (3/11) ఉన్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన భారత్ 13 పరుగులు మాత్రమే చేసి తీవ్ర కష్టాల్లో ఉన్నది.
1ST Test. WICKET! 9.4: Sarfaraz Khan 0(3) ct Devon Conway b Matt Henry, India 10/3 https://t.co/8qhNBrs1td #INDvNZ @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 17, 2024