శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 18:01:11

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్‌ పరీక్షలు

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్‌ పరీక్షలు

అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో పదో తరగతి బోర్డు పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉండే పదకొండు పేపర్లను ఆరు పేపర్లకు కుదించింది. ప్రతి పేపర్‌కు వంద మార్కులు కేటాయింది. ఈ ఆరు పేపర్లకు జూలై 10 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూలై 10న మొదటి లాంగ్వేజీ, జూలై 11న సెకండ్‌ లాంగ్వేజీ, జూలై 12న ఇంగ్లిష్‌, జూలై 13న గణితం, జూలై 14న జనరల్‌ సైన్స్‌, జూలై 15న సోషల్‌ పరీక్షను నిర్వహించనుంది. భౌతిక దూరం పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.  


logo