Fighter Jet Crashes | దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది. ఎయిర్ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా.. విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడా..? లేదా..? అన్నది స్పష్టంగా తెలియలేదు. కానీ, ప్రమాద తీవ్రతను చూస్తుంటే పైలట్ బతికే ఛాన్స్ లేదనే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందూస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసింది.
🚨 BREAKING: Indian #Tejas fighter jet crashes during a display at the #DubaiAirShow.
Updates on pilot status awaited💔
— Sarcasm (@sarcastic_us) November 21, 2025
BREAKING NEWS 🚨
Indian Tejas fighter crashes at Dubai Air Show during air display. #DubaiAirShow pic.twitter.com/GsoasbyXLh
— Ihtisham Ul Haq (@iihtishamm) November 21, 2025
Also Read..
Delhi Blast | హమాస్ తరహాలో.. కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంప్కు వైట్ కాలర్ టెర్రర్ కుట్రలు
Ammonium Nitrate: అమోనియం నైట్రేట్ అమ్మకాలు రికార్డు చేయండి.. ఢిల్లీ పోలీసులకు ఆదేశం