Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద కారులో పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు (Bomb Making Videos) పంపినట్లు దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు.
పాకిస్థాన్ (Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన హ్యాండ్లర్ (Jaish Handler).. ఉమర్‌కు బాంబు తయారీ వీడియో పంపినట్లుగా తేలింది. 40కిపైగా బాంబు తయారీ వీడియోలు పంపినట్లుగా భావిస్తున్నారు. వీడియోలు పంపిన జైషే హ్యాండ్లర్‌ను హంజుల్లా (Hanzulla)గా అధికారులు గుర్తించారు. అతడు జమ్ము కశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఫరీదాబాద్ ఉగ్రనెట్‌వర్క్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్‌తో టచ్‌లోకి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
అతడి ద్వారా ఉమర్ నబీ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించినట్లు దర్యాప్తులో తేలింది. హంజుల్లా ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. మరోవైపు అక్టోబర్‌లో జమ్ము కశ్మీర్‌లోని నౌగామ్‌లో జైషే మహ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్ర కుట్రలపై దర్యాప్తు మొదలైన విషయం తెలిసిందే. ఆ పోస్టర్లపై ‘కమాండర్ హంజుల్లా భాయ్’ అనే పేరు రాసి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. దీంతో జైషే హ్యాండ్లర్ గురించి తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Also Read..
Ammonium Nitrate: అమోనియం నైట్రేట్ అమ్మకాలు రికార్డు చేయండి.. ఢిల్లీ పోలీసులకు ఆదేశం
Air Pollution | తీవ్ర వాయు కాలుష్యం.. ఢిల్లీ స్కూల్స్‌లో అవుట్డోర్ గేమ్స్‌పై ప్రభుత్వం నిషేధం
ISS | రాత్రివేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనుతున్న ఢిల్లీ.. ఫొటోలు షేర్ చేసిన ఐఎస్ఎస్