Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో 400కిపైనే నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. నగరంలో తీవ్ర కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో అవుట్డోర్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. రాజధాని అంతటా కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంతో పాఠశాలల్లో అవుట్డోర్ కార్యకలాపాలు (outdoor activities in schools), గేమ్స్‌ను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
సాధారణంగా వింటర్ సీజన్ అయిన నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీలోని పాఠశాలలు స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. అయితే, తీవ్ర వాయు కాలుష్యం కారణంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఢిల్లీ ప్రభుత్వానికి ఇటీవలే సూచించిన విషయం తెలిసిందే. సుప్రీం సూచనల మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా అన్ని క్రీడా పోటీలను వాయిదా వేయాలని ఢిల్లీ-ఎన్సీఆర్లోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను ఆదేశించింది.
Also Read..
NEET | కోచింగ్ స్టాఫ్ వేధింపులు.. నీట్ విద్యార్థి ఆత్మహత్య
ISS | రాత్రివేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనుతున్న ఢిల్లీ.. ఫొటోలు షేర్ చేసిన ఐఎస్ఎస్
Earthquake | బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం.. టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం.. భారత్‌లోనూ ప్రకంపనలు