NEET | దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు (Suicide) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నీట్ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహారాష్ట్ర (Maharashtra)లోని చంద్రాపూర్ (Chandrapur)కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి జాతీయ స్థాయి మెడిసిన్ ప్రవేశపరీక్ష అయిన నీట్‌కు (NEET) సన్నద్ధమవుతున్నాడు. స్థానికంగా ఉన్న జనతా కెరీర్ లాంచర్ (Janta Career Launcher) అనే రెసిడెన్షియల్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. అయితే, గురువారం రాత్రి సదరు విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కోచింగ్ సెంటర్ సిబ్బంది వేధిస్తున్నారని (Harassment By Coaching Staff) తమతో చెప్పినట్లు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోచింగ్ సెంటర్లోని నలుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Earthquake | బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం.. టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం.. భారత్‌లోనూ ప్రకంపనలు
ISS | రాత్రివేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనుతున్న ఢిల్లీ.. ఫొటోలు షేర్ చేసిన ఐఎస్ఎస్