Hamas Tunnel | హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు ఆగటం లేదు. హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఐడీఎఫ్ (IDF) దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజాతోపాటూ లెబనాన్‌పైనా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్‌కు చెందిన భారీ టన్నెల్‌ను (Hamas Complex Tunnel) గుర్తించాయి.
సుమారు 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఈ టన్నెల్‌ను నిర్మించినట్లు ఐడీఎఫ్ గుర్తించింది. దాదాపు 80 రూమ్‌లతో కూడిన ఈ టన్నెల్ వీడియోని ఇజ్రాయెల్ తాజాగా బయటపెట్టింది. గాజాలో ఇప్పటిదాకా బయటపడ్డ అత్యంత భారీ సొరంగం ఇదే కావడం గమనార్హం. ఇందులో మొహమ్మద్ సిన్వర్, మొహమ్మద్ షబానా సహా హమాస్ కీలక నేతలు తలదాచుకునేవారని ఇజ్రాయెల్ దళాలు నిర్ధరించాయి. అంతేకాదు గతంలో అపహరించబడిన ఐడీఎఫ్ అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్‌ను కూడా ఇక్కడే బంధించినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. అక్కడ గోల్డిన్‌కు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది.
ఈ సొరంగం జనసాంద్రత కలిగిన రఫా ప్రాంతంలో గుర్తించారు. యూఎన్ఆర్డబ్ల్యూఏ (యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్) కంపౌండ్, మసీదులు, క్లినిక్స్, స్కూళ్లు లాంటి సున్నితమైన ప్రాంతాల గుండా ఈ టన్నెల్ వెళుతుందని ఐడీఎఫ్ తెలిపింది. ఏకంగా ఓ నగరాన్నే నిర్మించుకున్నారని.. లోపల అత్యంతక్లిష్టమైన పరిస్థితులు ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి. టైల్స్‌తో ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఇందులో 80 గదులతో ప్రత్యేక సదుపాయాలను నిర్మించుకుంది హమాస్. వెస్ట్రన్ టాయ్‌లెట్స్‌తో కూడిన బాత్రూమ్లు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, దీర్ఘకాలిక నివాసాలతో పాటూ భారీగా ఆయుధ నిల్వలను ఐడీఎఫ్ ఈ టన్నెల్లో గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఐడీఎఫ్ దళాలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
⭕️ EXPOSED: A 7+ kilometer Hamas tunnel route that held Lt. Hadar Goldin.
IDF troops uncovered one of Gaza’s largest and most complex underground routes, over 7 km long, ~25 meters deep, with ~80 hideouts, where abducted IDF officer Lt. Hadar Goldin was held.
The tunnel runs… pic.twitter.com/GTId75CvYw
— Israel Defense Forces (@IDF) November 20, 2025
Also Read..
Earthquake | బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం.. టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం.. భారత్‌లోనూ ప్రకంపనలు
ఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 33 మంది మృతి
Donald Trump | రొనాల్డోతో ట్రంప్ ఫుట్‌బాల్.. వీడియో షేర్ చేసిన అధ్యక్షుడు